రాజశేఖర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ?

గతంలో ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ హీరో చెయ్యబోయే తదుపరి సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఏ సబ్జెక్టు లాక్ అవ్వలేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 4న పుట్టినరోజు సందర్భంగా ఆయన తన నెక్స్ట్ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈలోపు కథ, దర్శకుడిని ఫైనల్ చెయ్యనున్నారు.

‘గరుడవేగ’ ఘన విజయాన్ని అందుకోవడంతో తరువాత రాజశేఖర్ ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారో చూడాలని అందరిలోనూ ఆతురత నెలకొంది. ‘గరుడవేగ’ సక్సెస్ తరువాత రాజశేఖర్ కు కథ వినిపించడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకొచ్చారు. మరి వాటిలో ఆయన దేన్ని ఫైనల్ చేస్తారో చూడాలి.

Exit mobile version