నాని నిర్మాతగా మారి చేస్తోన్న సినిమా అ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్, రెజినా, నిత్యామీనన్, ఇషా రెబ్బా , అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమలో జరిగే సన్నివేశాలు ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉండబోతున్నాయి. తరువాత ఏం సన్నివేశం వస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా ఈ సినిమా ఉండబోతోంది.
ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 31న సాయంత్రం 6గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో నాని ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు వెల్లడించబోతున్నారు. అదే వేడుకలోనే సినిమాకు థ్రియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయనున్నారు.
