నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తొలిప్రేమ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. అన్ని పాటలు బాగుండడంతో హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఫూర్ లవ్ స్టొరీ గా రానున్న ఈ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర యూనిట్. సినిమా మొత్తం యూత్ ఫుల్ గా ఉండబోతోందని సమాచారం.
ఈ సినిమా ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. జార్జ్ అందించిన సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ కానుంది. సాఫ్ట్ వేర్ పాత్రలో వరుణ్ నటించబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ప్రియాదర్శి, హైపర్ ఆది ఈ సినిమాలో మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు.
