
దక్షిణాది యువ సంగీత దర్శకుల్లో ఒకరైన అనిరుద్ రవిచందర్ ఒకవైపు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇంకో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అదే ఎప్పుడూ లాభదాయకంగా ఉండే రెస్టారెంట్ బిజినెస్. అయన తన స్నేహితులతో కలిసి చెన్నైలో సమ్మర్ హౌస్ ఈటరీ అనే కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించారు.
దీంతో ఆయన సక్సెస్ ను కోరుకుంటూ పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళంలో మంచి పేరున్న ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో ఇటీవలే రిలీజైన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ తో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. త్వరలో ప్రారంభంకానున్న ఈ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమాకి కూడా ఈయనే సంగీతం అందించనున్నారు.