నితిన్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి

‘లై’ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో హీరో నితిన్ త‌దుప‌రి చిత్రంపై మ‌రింత దృష్టిపెట్టాడు. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరిగా తెరకేక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలో జరుగుతోంది.

గుర్తుందా శీతాకాలం అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది. త్వరలో చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తరువాత నితిన్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి నుండి ప్రారంభం కానుంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Exit mobile version