తొలిప్రేమ సినిమాకు అదే హైలెట్ అంట !

నూతన దర్శకుడు వెంకి అట్లూరి దర్శకతవం వహించిన తొలిప్రేమ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాశిఖాన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం మేజర్ ప్లస్ కానుంది. బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం లండన్ లో చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు సినిమాకు గ్రాండ్ లుక్ ను తెచ్చిపెట్టబోతున్నాయని సమాచారం.

ఈ సినిమా సినిమాటోగ్రఫర్ జార్జ్ లండన్ అందాలను అద్భుతంగా చూపించాడని తెలుస్తోంది. యూత్ ఫుల్ లవ్ స్టోరి గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో వరుణ్ తేజ్ సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా కనిపించబోతున్నాడు. ముందు ఈ సినిమాను 9 న విడుదల చెయ్యాలని భావించిన ఇంటిలిజెంట్ సినిమా ఉండడంతో 10 న రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version