మెగా హీరోల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే వినాయక్ దర్శకత్వంలో ఆయన చేసిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ 9వ తేదీన రిలీజవుతుండగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నాడు తేజ్. ఇప్పటికే కొంత చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుండి మరొక కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది.
ఇది కాకుండా ‘ఐతే, సాహసం’ ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా నటించనున్నాడు ఈ సుప్రీమ్ హీరో. చివరగా ‘మనమంతా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఏలేటి తేజ్ కోసమే ప్రత్యేకంగా ఒక స్క్రిప్ట్ రాసుకున్నారట. ఆ స్క్రిప్ట్, అందులో తన క్యారెక్టర్ నచ్చి తేజ్ ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నారట. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి .
