ఎన్టీఆర్ బిగ్ బాస్ న్యూస్ లో నిజం లేదు !

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 1 కు మంచి రెస్పాన్స్ లభించింది. 14 మంది సెలబ్రిటీలతో పోటాపోటిగా జరిగిన ఈ గేమ్ షో లో చివరికి శివ బాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. తాజా సమాచారం మేరకు బిగ్ బాస్ సీజన్ 2 జూన్ నుండి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

కాని ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 జూన్ నెల నుండి ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాకు కమిట్ అయ్యాడు. అందులో మొదటిది త్రివిక్రమ్ సినిమా. ఈ మూవీ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమా తరువాత రాజమౌళి చరణ్ సినిమాలో నటించబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా అక్టోబర్ లో ప్రారంభం కానుంది. రెండు సినిమాలు పూర్తి అయ్యాక బిగ్ బాస్ సీజన్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version