స్వామి రారా డైరెక్టర్ సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మొదట ఈ సినిమాలో కాజల్, నిత్య మీనన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన మాట వాస్తవమే. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల వారిద్దరు ఈ సినిమాలో నటించడం లేదు.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన కళ్యాణి ప్రియదర్శిని నటించబోతోంది. నిత్య మీనన్ స్థానంలో కళ్యాణి ఎంపిక అయ్యింది. మర్చి మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శర్వానంద్ ఈ సినిమాలో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కబోయే సినిమాలో నటించే మరో హీరోయిన్ వివరాలు త్వరలో తెలియనున్నాయి.
