ఆది సరసన ఇద్దరు హీరోయిన్లు !


యువ హీరో ఆది గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కాస్త వెనుకబడ్డారు. ఆయన చివరి చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ కూడ సరైన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ప్రస్తుతం కొత్త కథల్ని వింటున్న ఈ హీరో ‘కేరింత, వినాయకుడు’ ఫేమ్ సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ముందుగా ఎయిర్ టెల్ ప్రకటన ద్వారా బాగా పాపులర్ అయిన సాషా చెత్రిని ప్రాజెక్టులోకి తీసుకోగా ఇప్పుడు ‘నందిని నర్సింగ్ హోమ్, కేరింత’ లాంటి సినిమాల్లో నటించిన నిత్యా నరేష్ ను కూడ మరొక కథానాయకిగా సెలెక్ట్ చేశారు. అంటే ఆది ఈసారి ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడన్నమాట. ఈ చిత్రం యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుందని సమాచారం.

Exit mobile version