కళ్యాణ్ రామ్, కాజల్ నటించిన ఎం.ఎల్.ఎ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా నిడివి రెండు గంటల తొమ్మిది నిమిషాలు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను త్వరలోనే గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. ‘లక్ష్మి కళ్యాణం’ తరువాత కళ్యాణ్ రామ్, కాజల్ కలిసి చేసిన సినిమా ఇదే.
బ్రహ్మానందం, పృథ్వి, పోసాని కామెడి ఈ సినిమాలో బాగా వచ్చిందని సమాచారం. మార్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించాడు. కామెడి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎంఎల్ఎ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
