మంచి ఓపెనింగ్స్ దిశగా ‘ఛల్ మోహన్ రంగ’ !

నితిన్ 25వ చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ ఈరోజే విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్థాయిలో రిలీజైన ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీ సంపాదించింది. దీంతో చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో సైతం సినిమాకు ప్రీమియర్ల ద్వారా మంచి స్టార్ట్ లభించినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ నిర్మాణం, త్రివిక్రమ్ కథను అందించడం వలన విడుదలకు ముందే సినిమాపై ఏర్పడ్డ క్రేజ్ ఓపెనింగ్స్ కు బాగా కలిసొచ్చింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించగా మేఘా ఆకాష్ నితిన్ కు జోడీగా నటించింది.

Exit mobile version