చైనాలో రిలీజ్ అవ్వనున్న రంగస్థలం !

రామ్ చరణ్ , సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే . ఇప్పుడు ఈ చిత్రాన్ని చైనా లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర నిర్మాతలు . ఇటీవల బాహుబలి సినిమా కూడా అక్కడ విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది . ఈ రంగస్థలం ను కూడా అక్కడ రిలీజ్ చేసి చైనా ప్రేక్షకుల స్పందనను తెలుసుకోవాలనుకుంటుంది చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ ‘బాహుబలి’ రికార్డులని బద్దలు కొట్టి రూ.125 కోట్ల షేర్ కు పైగా వసూళ్లను సాధించి ప్రస్తుతం టాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా 2 వ స్థానంలో కొనసాగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

Exit mobile version