దసరాకు రానున్న విశాల్ ‘పందెంకోడి 2’ !

vishal1

2005 లో విశాల్ , మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లుగా తమిళ భాషలో లింగుసామి తెరకెక్కించిన చిత్రం ‘సందకోడి’ . తెలుగులో ‘పందెంకోడి’ పేరుతో విడుదలయ్యింది . ఈ సినిమా రెండు భాషల్లో ఘన విజయం సాధించింది . ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘సందకోడి 2’ చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే . ఈ సినిమాలో హీరో విశాల్ సరసన కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ లు నటిస్తున్నారు . ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నెలలో కంప్లీట్ చేసి చిత్రాన్ని విజయదశమి కానుకగా రిలీజ్ చేయనున్నారు .

విశాల్ సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు . తెలుగులో ‘పందెంకోడి 2’ గా రానున్న ఈసినిమా కూడా అదే రోజున విడుదల కానుంది . ఈ విషయాన్ని విశాల్ స్వయంగా ప్రకటించారు . తను నటించిన అభిమన్యుడు సినిమా మంచి విజయం సాధించడంతో ఇక్కడ విజయాత్రను చేపడుతున్నారు . ఈసందర్బంగా వైజాగ్ లోని సిఎమ్ఆర్ షాపింగ్ మాల్ లో సందడి చేశారు విశాల్ మరియు చిత్ర టీం.

Exit mobile version