నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రతో క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు . ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలని లైన్లో పెట్టాడు బాలకృష్ణ . అందులో వి వి వినాయక్ దర్శత్వంలో తెరకెక్కనున్న సినిమా ఒకటి .ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ హాట్ టాపిక్ అవుతుంది వీరిద్దరి కలియికలో రానున్న ఈ సినిమాకు ‘ఎకె 47′, అనే టైటిల్ ను పెట్టినట్లు గా వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలఫై చిత్ర బృందం స్పందించలేదు.
సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం . మరి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు లాంచ్ డేట్ ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి . గతంలో బాలయ్య వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన’ చెన్నకేశవరెడ్డి’ అనుకున్నంత విజయాన్ని సాదించలేకపోయిన మంచి కలెక్షన్స్ ను సాధించింది .ఇక బాలకృష్ణ ఈ సినిమాతోపాటు తనకు ‘సింహ , లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు .
