ఆ టైటిల్ బాలకృష్ణ సినిమా కోసం కాదట !

balakrishna ckalyan

నటసింహం నందమూరి బాలకృష్ణ వి వి వినాయక్ దర్శత్వంలో తెరకెక్కనున్న సినిమా లో నటించనున్నాడని తెలిసిందే .ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ నిన్న హాట్ టాపిక్ అయ్యింది . వీరిద్దరి కలియికలో రానున్న ఈ సినిమాకు ‘ఎకె 47’, అనే టైటిల్ ను పెట్టినట్లు గా వార్తలు వచ్చాయి . అయితే ఈ వార్తలఫై స్పందించారు ఈ చిత్ర నిర్మాత సి కళ్యాణ్ .

తెలుగు ఛాంబర్ అఫ్ కామర్స్ లో ‘ఎకె 47’, అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది నిజమేనని అయితే ఈ టైటిల్ బాలకృష్ణ -వినాయక్ కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రానికి కాదని అన్నారు. తన బ్యానర్లో నిర్మించే తదుపరి చిత్రానికి ఆ టైటిల్ ను వాడనున్నట్లు కళ్యాణ్ వివరించారు .

Exit mobile version