ఈరోజు విడుదలైన ఏకైన సినిమా ‘సమ్మోహనం’. సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి జంటగా నటించిన ఈ చిత్రం తెలుగునాట మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులు, ప్రేక్షకులు సినిమా క్లాస్ గా ఉందని అంటున్నారు. ఇక ఓవర్సీస్లో కూడ సినిమా ప్రీమియర్లకు మంచి కలెక్షన్స్ దక్కాయట.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు సుమారు 120 లొకేషన్లలో విడుదలైన ఈ చిత్రం దగ్గర దగ్గర 60,000 డాలర్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక నిన్న విడుదలైన ‘నా నువ్వే’ అంతగా ప్రభావం చూపకపోవడం, పాజిటివ్ టాక్ ఉండటం, వేరే తెలుగు సినిమాలేవీ లేకపోవడంతో ఓవర్సీస్ వసూలు ఇలాగే మెరుగ్గా కొనసాగే అవకాశాలున్నాయి.
