తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా షూటింగ్ రెండు నెలల పాటు యు కె లోజరుగనుందన్న విషయం తెలిసిందే. అయితేఈ నెల మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగాల్సి ఉండగా వీసా కారణాల వల్ల వాయిదా పడింది ఇప్పుడు ఈ చిత్రం ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది . ఈ షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది.
బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమా కు మిస్టర్ మజ్నుఅనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు . థమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.
