
టాలీవుడ్ లో ఒకప్పుడు క్రియేటివ్ సినిమాలు తీసి క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు కృష్ణవంశీ . గత కొంత కాలంగా సరైన విజయాలు లేక బాగా వెనుక పడిపోయారు ఇటీవల గతంలో నాని తో తీసిన పైసా , అలాగే సందీప్ కిషన్ తో తీసిన నక్షత్రం దారుణమైన ఫలితాన్ని పొందాయి .
కృష్ణవంశీ ఇప్పుడు ఎలాగైనా మళ్ళి ఫామ్ లోకి రావాలని కొత్తవాళ్లతో ఒక చిత్రాన్ని తెరకేకించేందుకు సిద్ధమవుతున్నారు . ఈ సినిమాలో ఒక పాత్రా కోసం పాపులర్ నటి కావాలనుకున్నారట దాంతో అయన ఈ పాత్రా కోసం కాజల్ ని సంప్రదించగా ఆమె తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు అని తెలిసింది . గతంలో కాజల్ కి చందమావ తో మంచి విజయాన్ని అందించారు కృష్ణవంశీ మరి ఇప్పుడు కాజల్ ఆ కృతజ్ఞతో ఈ చిత్రంలో నటించాడని అంగీకరిస్తుందో లేదో చూడాలి .