ఈ ఫొటోలో ఉంది జూ ఎన్టీఆర్ రెండో కుమారుడేనా ?

ntr

‘జూ ఎన్టీఆర్ సతీమణి ‘లక్ష్మీ ప్రణతి’ గురువారం ఉదయం పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఎన్టీఆర్ రెండో కుమారుడు ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పసిబిడ్డ ఫోటో వైరల్ అయింది. అయితే ఆ ఫోటో నిజంగానే ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి దంపతుల రెండో కుమారుడిదేనా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏమైనా జూ ఎన్టీఆర్ మళ్ళీ తండ్రి అవ్వడం ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఎన్టీఆర్ తన మొదటి కుమారుడికి అభయ్ అని పేరు పెట్టారు. మరీ తన రెండో కుమారుడికి ఏం పెడతారో అని ఆయన అభిమానులు ఇప్పటినుంచే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫొటోలో ఉన్న పసిబిడ్డకి ఎన్టీఆర్ పోలికలు ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్నాడు.

Exit mobile version