జులై లో రానున్న లవర్ !

Lover2

గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమవుతున్నాడు హీరో రాజ్ తరుణ్ . ఇటీవల ‘రాజుగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ కి ఈ సినిమా కూడా చేదు జ్ఞాపకమే మిగిల్చింది . ప్రస్తుతం అయన ‘లవర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు . అన్నీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ నటిస్తుంది .

ప్రముఖ బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఫై దిల్ రాజు సమక్షంలో హర్షిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి చాయాగ్రహణం అందిస్తున్నారు .మరి రాజ్ తరుణ్ ఈ సినిమాతోనైనా విజయం సాదిస్తాడో లేదో చూడాలి .ఈ చిత్రాన్ని జులై రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

Exit mobile version