యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా, నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘పంతం’. ఈ చిత్రం అడియో ఫంక్షన్ ఈ నెల ఆఖర్లో విజయవాడలో జరపటానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అడియో ఫంక్షన్ తర్వాత, చిత్రం విడుదల అవ్వబోయే ముందు అభిమానుల కోసం వైజాగ్ లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా నిర్వహిస్తారట.
అయితే సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి పంతం టీమ్ తమ సినిమా జూలై 5న విడుదల చేస్తామని చెబుతూనే ఉంది. కానీ ఉన్నట్టు ఉండి గోపీచంద్ పంతానికి పోటీగా తేజ్ ఐ లవ్ యూ, విజేత సినిమాలు వస్తున్నాయి. మరి ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి. సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ పంతం చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
