హీరో ‘విశాల్, సమంత’ జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం ఫై పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన సినిమా ‘ఇరుంబు తెరై’. ఈ చిత్రాన్ని జి. హరి’ అభిమన్యుడు’ పేరుతో జూన్ 1న తెలుగులో విడుదల చేశారు .ఇక ఈచిత్రం 17 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 7. 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రాన్ని కేవలం 3 కోట్ల కు దక్కించుకున్నారు నిర్మాత హరి ఈ లెక్కన చూసుకుంటే ఈ చిత్రం ఆయనకు భారీ లాభాలనే మిగిల్చనుంది .
ఈ చిత్రం విడుదలై 3 వ వారంలోకి ప్రవేశిస్తున్న కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి . సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు ఇప్పట్లో తెలుగులో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో మరి కొన్ని రోజుల పాటు ఈ చిత్రం ఇదే రన్ ను కొనసాగించనుంది . యాక్షన్ కింగ్ ‘అర్జున్’ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు .
