మళ్ళీ పోలీసులకి దొరికిన యంగ్ టాలెంటెడ్ హీరో !

Jai1

‘జర్నీ’ చిత్రంలో అమాయకమైన కుర్రాడి పాత్రలో నటించి మెప్పించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైయ్యారు యంగ్ హీరో ‘జై’. మంగళవారం చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో రాంగ్ డ్రైవింగ్ తో విపరీతంగా సైరన్‌ మోగిస్తూ వెళ్తుండగా చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు కారును వెంబడించి జై ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా జై మద్యం సేవించి ఆ మైకంలో ఏకంగా ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనాన్నే ఢీ కొట్టడం జరిగింది. ఆ కేసులో జైకిజరిమానా విధించి, ఆరు నెలలు పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు

తాజాగా రాంగ్ డ్రైవింగ్ తో మళ్ళీ పట్టుబడిన జైకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఇంకెప్పుడు ఇలా చేయనని జై పోలీసులను రిక్వెస్ట్ చేశారట. దీంతో పోలీసులు అతన్ని ఎలాంటి కేసు నమోదు చేయకుండా హెచ్చరించి వదిలేశారు. ఈ వ్యవహారం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జై రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.

Exit mobile version