‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి పూజా హెగ్డే. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ హీరో గా పరిచయమైన ‘ముకుంద’ లో నటించింది. అయితే ఈ రెండు సినిమాలతో విజయాన్ని సాధించలేకపోవడంతో ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. గత ఏడాది అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం తో పూజా హెగ్డే తెలుగులో మళ్ళి బిజీ హీరోయిన్ గా మారారు .
ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రంలో అలాగే రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు మహేష్ బాబు 25 వ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటు యువ హీరో సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాలో నటించింది . ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది . ఇక ఇవి గాక వచ్చే ఏడాది ‘జిల్’ ఫెమ్ రాధా కృష్ణ తెరకెక్కించనున్న చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది.
