మెగా డాటర్ నిహారిక ‘వెడ్డింగ్’కి 10 లక్షల వ్యూస్ !

Happy Wedding1

‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక, మళ్ళీ హీరోయిన్ గా చేస్తున్న రెండవ చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పటికే విడుదలైన ఈ ‘హ్యాపీ వెడ్డింగ్’ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. 10 లక్షల డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్రబృందం అఫీషియల్‌గా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఇక ఈ చిత్రంలో పెళ్ళి ప్రాముఖ్యతను వివరించనున్నారు. ప్రధానంగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందివ్వగా తమన్ నేపధ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్రా లోకేష్, మురళీ శర్మ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారట.

Exit mobile version