త్రివిక్రమ్ ఆ హీరోయిన్ కి తెలుగు మాస్టారట !

anupama2

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన `అ ఆ` చిత్రంతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే అనుప‌మా మ‌ల‌యాళీ కావడంతో, `అ ఆ` చిత్రం షూటింగ్ సమయంలో ఆమెకు అస్సలు తెలుగు తెలియదు. అయిన‌ప్ప‌టికీ కష్టపడి తెలుగు నేర్చుకొని మాట్లాడటమే కాకుండా స్వ‌యంగా ఇప్పుడు డ‌బ్బింగ్ కూడా చెప్పుకొంటూ తెలుగు ప్రేక్షకులకు మ‌రింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

కాగా అనుపమా తన తెలుగు గురించి మాట్లాడుతూ.. నేను ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నానంటే కార‌ణం దర్శ‌కుడు త్రివిక్ర‌మ్ గారు అని తెలిపింది. `అ ఆ` చిత్ర సెట్‌లో అంద‌రూ తెలుగులోనే మాట్లాడేవారు, నాకేమో తెలుగు అస్సలు అర్థ‌మ‌య్యేది కాదు. అప్పుడు త్రివిక్ర‌మ్‌గారే ఎంతో ఓర్పుతో నాకు ప్ర‌తీ వాక్యానికి అర్థం చెప్తూ తెలుగు నేర్పించారు. అందుకే నేను తెలుగులో మాట్లాడగలుగుతున్నానని త్రివిక్ర‌మ్ గారే నాకు తెలుగు మాస్టారని అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ చెప్పుకొచ్చింది.

Exit mobile version