యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది ?’ గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమేగాక ఇండియాలోని పలు ఇతర నగరాల్లో కూడ విడుదలచేయాలని నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భావిస్తోంది. అందుకే నిన్న రాత్రి ముంబైలో సినిమాకు స్పెషల్ షో వేయడం జరిగింది.
ఈ సమయంలోనే తరుణ్ భాస్కర్ ప్రముఖ దర్శకుడు, ఇటీవలే ‘సంజు’ సినిమాతో మరోఆరి సంచలనంగా మారిన రాజ్ కుమార్ హిరానీని కలవడం జరిగింది. కాసేపు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ ఒకరి సినిమాకు మరొకరు అభినందనలు తెలుపుకున్నారు.
