కొద్ది రోజుల క్రితమే ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సూపర్ స్టార్ రజనీ కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. విభిన్నమైన విజన్ కలిగిన దర్శకుడిగా మంచి పేరున్న యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై పేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి.
గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉండనున్న ఈ సినిమాలో యువ నటుడు,’మెర్క్యూరీ’ ఫేమ్ దీపక్ పరమేశన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘మెర్క్యూరీ’లో దీపక్ నటన పట్ల ఇంప్రెస్ అయిన సుబ్బరాజ్ ఈ ప్రాజెక్టులోకి అతన్ని తీసుకున్నారు.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. ఇందులో బాబీ సింహ, విజయ్ సేతుపతి వంటి పాపులర్ స్టార్లు నటించనున్నారు.
