‘ధబాంగ్’ సిరీస్ కు కొనసాగింపుగా తెరకెక్కనున్న ‘ధబాంగ్ 3’ చిత్రంలో ‘నటించనున్నారు ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో ఒక హిందీ చిత్రానికి సైన్ చేశానని ఆయనే స్వయంగా ప్రకటించారు. కాకపోతే అది ‘ధబాంగ్ 3’ అని ఆయన చెప్పలేదు.
కానీ బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంతోనే జగ్గుభాయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ‘వాంటెడ్’ చిత్రం తరువాత మళ్లీ సల్మాన్, ప్రభుదేవాల కలయికలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
