‘లేడి డైరెక్టర్’కి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో !

Surya lady

తమిళ స్టార్ సూర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ మళ్లీ కొత్తవి కూడా కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ చిత్రంలో, కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో సూర్య నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం సూర్య కొత్తగా మరో చిత్రాన్ని కూడా అంగీకరించారని తెలుస్తోంది.

‘సాలా ఖడూస్’ చిత్రంతో, తెలుగులో రీమేక్ గా వచ్చిన ‘గురు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకురాలు సుధా కొంగర. ఐతే ఆమె ఓ పిరియాడికల్ నేపథ్యంలో సాగే కథను రాశారు. ఆ కథని సూర్యకి వినిపించారు. కథ ఆయనకు బాగా నచ్చడంతో ఆమె దర్శకత్వంలో నటించడానికి సూర్య అంగీకరించారని సమాచారం. సూర్య ఇప్పటివరకు పని చేసిన దర్శకులు అందరూ మగవారే, ఒక లేడీ దర్శకురాలితో సూర్య పని చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Exit mobile version