కపిల్ దేవ్ బయోపిక్ లో కోచ్ పాత్రలో నటించనున్న ప్రముఖ నటుడు !

Ranveer Singh

లెజండరీ క్రికెటర్ ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ’83’ అనే చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే . రణవీర్ సింగ్ ప్రధాన పాత్రను పోషించనున్నఈ చిత్రంలో ఆయనకు కోచ్ గా బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటించనున్నారు .

టాప్ డైరెక్టర్ ఖబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది . విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో ఒకే సారి విడుదలకానుంది .

Exit mobile version