తమిళ ‘అర్జున్ రెడ్డి’కి హీరోయిన్ దొరికింది !

Model Megha1
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన కుమారుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ధృవ్ నటిస్తోన్న ఈ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళంలో ఈ చిత్రానికి ‘వర్మ’ అని పేరు పెట్టింది చిత్ర బృందం. తమిళ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి.

ఐతే ఈ ‘వర్మ’ చిత్రానికి సంబంధించి యాభై శాతం పైగా షూట్ పూర్తయినా శాలిని పాండే స్థానంలో నటిస్తున్న హీరోయిన్ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయేసరికి ధృవ్ సరసన నటించే ఆ హీరోయిన్ ఎవరా అని సినీ అభిమానులు గత కొంతకాలంగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం బెంగాలీ మోడల్ మేఘా చౌదరి ‘వర్మ’ చిత్రంలో ధృవ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు బాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది.

Exit mobile version