
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంజు’. విడుదలైన రోజునుండి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తు మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం 6 రోజులకు గాను రూ.185 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ రోజు తో ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్ లో చేరనుంది.
ఇక ఈ చిత్రం అటు ఓవెర్సిస్లో కూడా మంచి వసూళ్లను సాధింస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం కావడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. రణబీర్ కపూర్ నటన ఈ చిత్ర విజయంలో కీలక పాత్రను పోషించింది .