నాని ‘సాహసం’ చేయనున్నాడా ?

Nani11
అనతికాలంలోనే 21 చిత్రాలను పూర్తి చేసి సహజ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో నాని. ప్రస్తుతం ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర హీరో నాగార్జున తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఆయన ‘ మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.

ఇక ఇప్పుడు తాజాగా నాని ‘సాహసం’ చిత్ర డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో సుప్రసిద్దుడైన యేలేటి ,నాని తో ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తాడో చూడాలి. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Exit mobile version