ఇంకొద్దిసేపట్లో సప్రైజ్ ఇవ్వనున్న నాగార్జున, నాని !

nag nani

అక్కినేని నాగార్జున, నానిలు కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనుండగా నాని డాక్టర్ పాత్రలో, అదీ నాగార్జునకు పర్సనల్ డాక్టర్ గా అలరించనున్నాడు. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.

సినిమా మొదలై చాలా రోజులు కావొస్తున్నా ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు నాని, నాగార్జునలు ఈ సినిమాకు సంబందించి సప్రైజ్ ఏదో ఇవ్వనున్నారట. ఈ సప్రైజ్ ఫస్ట్ లుక్ గురించైనా అయ్యుండొచ్చు లేదా విడుదల తేదీ గురించైనా అయ్యుండొచ్చు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ నాగార్జునకు జంటగా నటిస్తుండగా రష్మిక మందన్న నానికి జోడీగా నటిస్తోంది.

Exit mobile version