
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన కొత్త చిత్రాన్ని ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారని తెలిసిందే . ఇక ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు , హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని సమాచారం .
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ‘చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్’ అనే ఉపశీర్షిక కలిగిన టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ను ఇంకా ఖరారు చేయలేదు. ఇక నిన్న ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చినా సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.