ఆమె చాలా సంవత్సరాల తర్వాత ఒప్పుకుంది – షారుఖ్ !

Shah Rukh Khan

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా యూరప్‌ టూర్‌ కి సంబంధించిన ఆయన ఎప్పటికప్పుడు తమ అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.

ఐతే తాజాగా షారూఖ్‌ ఖాన్‌ తన అభిమానులు సంతోష పడే మరో ఆసక్తి కరమైన ఫోటోని ఆయన ట్వీట్‌ చేశారు. ఆయన భార్య గౌరీఖాన్‌ తో కలిసి దిగిన ఫోటోను షారూఖ్‌ ట్వీట్ చేస్తూ ‘చాలా సంవత్సరాల తరువాత, నా భార్య నేను తీసిన ఫోటోను పోస్ట్‌ చేసేందుకు ఒప్పుకుంది’ అంటూ కామెంట్‌ పెట్టారు. ఇక షారూఖ్ ఖాన్ నటిస్తోన్న జీరో చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.

Exit mobile version