‘ఎన్టీఆర్ ‘చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న ప్రముఖ నటుడు !

Murali Sharma

క్రిష్ దర్శకత్వంలో సీనియర్ అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కొద్దీ రోజుల క్రిందట ప్రారంభమైంది. తాజాగా ఈచిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రముఖ నటుడు మురళీ శర్మ. గత కొంతకాలంగా తెలుగులో అనేక చిత్రాల్లో నటిస్తు మంచి గుర్తింపును తెచ్చుకున్నా ఆయన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు , నిర్మాత ఆలూరి చక్రపాణి పాత్రలో నటిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈచిత్రంలో రానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో నటించనున్నారు. విష్ణు ఇందూరి , సాయి కొర్రపాటి లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version