సీనియర్ హీరో డా రాజశేఖర్ హీరోగా, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ లో రెండు కోట్ల రూపాయలతో భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాజశేజర్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. రాజశేఖర్ పై మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తో కలిసి రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.