కమల్ మరో సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నాడు ?

Kamal Haasan

లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల ‘విశ్వరూపం’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన’ విశ్వరూపం 2’తో ప్రేక్షకులముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఈ చిత్రం తరువాత శంకర్ – కమల్ కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ లో నటిస్తున్నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు కమల్ మరో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారట. 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్ నటించిన చిత్రం ‘తేవర్ మగన్’. ఈచిత్రానికి స్క్రిప్ట్ ను కూడా ఆయన రాసి చిత్రాన్ని ఆయన అన్న చంద్రహాసన్ తో కలిసి నిర్మించాడు. శివాజీ గణేశన్ , రేవతి, గౌతమి ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రం మంచి విజయం సాధించింది. ఈచిత్రాన్ని తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ పేరుతో అనువదించారు.

ఇక ఇన్ని సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘తేవర్ మగన్ 2’ ను తెరకెక్కించాలనుకుంటున్నాడట కమల్. అయితే ఈ వార్తలఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.

Exit mobile version