‘ఛలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న, ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గీత పాత్రలో ఆమె నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అక్కట్టుకున్నేలా ఉండటంతో.. తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక తాజాగా దేవదాస్ సినిమాతో మరో సక్సెస్ను అందుకుంది. అయితే తాజాగా రష్మిక మండన్నా ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. ‘ఎవ్రీ నాన్ తెలుగు ఫ్రెండ్ ఎవర్’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ లో రష్మిక తెలుగు రాని ఓ కన్నడ అమ్మాయిగా నటించింది. ఎవరైన తెలుగులో మాట్లాడిన విషయాలను తెలుసుకునేందుకు ఫ్రెండ్ సాయం తీసుకోవటం,అలాగే సినిమాలకు తన ద్వారా డబ్బింగ్ చెప్పించుకోవటం లాంటి సీన్స్ ను చాలా సరదాగా తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం రష్మిక ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో పాటు ఓ కన్నడ ఫిల్మ్ తో బిజీగా ఉంది.
