2.0 లో అతిధి పాత్రలో స్టార్ హీరోయిన్ ?

Aishwarya Rai

రోబో చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0 చిత్రం యొక్క టీజర్ ఇటీవల విడుదలై యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రముఖ దర్శకుడు శంకర్ భారీ బడ్జెత్తో తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ , బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ ,అందాల తార ఐశ్వర్య రాయ్ కూడా ఈచిత్రంలో కనిపించనుందట. ఆమె ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించిందని సమాచారం .
ఇక మొదటి పార్ట్ లో రజినీ సరసన ఐశ్వర్య రాయ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ చిత్రంలో కూడా ఆమె కొద్దీ సేపు స్క్రీన్ ఫై కనబడనుందట.

ఇక ఈచిత్రం యొక్కట్రైలర్ దీపావళి రోజు విడుదలకానుంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈచిత్రం నవంబర్ 29న ప్రేక్షకులముందుకు రానుంది. భారీ విజువల్ వండర్గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version