అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన తదుపరి చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. క్లాస్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్ని తన తదుపరి చిత్రం చేయబోతున్నారని గత కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. అయితే విక్రమ్ కుమార్ చెప్పిన కథ బన్నికి నచ్చలేదని తెలుస్తోంది.
కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఓ ఇద్దరు దర్శకులు బన్నికి కథలు వినిపించారు. లేటెస్ట్ గా గీతగోవిందంతో ఘనవిజయం సాధించిన పరుశురామ్ మరియు దర్శకుడు మారుతి కూడా బన్నికి కథలు వివరించారు. కానీ అల్లు అర్జున్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదట. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
బన్ని ఈ సారి స్క్రిప్ట్ చాలా పకడ్బంధీగా ఉండేలా చూసుకుంటున్నాడు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. బన్ని చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, శాసనం నాగ అశోక్ కుమార్ కలిసి నిర్మించనున్నారని కూడా గతంలో వార్తలు వస్తున్నాయి.
