మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ అమెరికా వెళ్లి మరి, తన లుక్ మార్చుకున్నాడు. తేజ్ ఫిట్ బాడీతో పాటు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఈ సినిమాలో కనిపిస్తాడట.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల మూడో వారంలో షూట్ కి వెళ్ళటానికి సిద్ధం అవుతుంది చిత్రబృందం. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఐతే వారి పేర్లే చిత్ర మరియు లహరి అట. అందుకే ఈ చిత్రానికి హీరోయిన్లు పేర్లు బేస్ చేసుకొని చిత్రలహరి అని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించనున్నారు. ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు.
