సౌత్ లో ఎంట్రీ ఫై స్పందించిన జాన్వీ !

Jhanvi Kapoor
‘దఢక్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అలనాటి అందాలతార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్. ఈచిత్రం తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది జాన్వీ. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న ‘తఖ్త్’ అనే చిత్రంలో నటిస్తుంది.

ఇక జాన్వీ తెలుగులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఓక చిత్రంలో నటించనుందని అలాగే తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జాన్వీ స్పందిస్తూ ప్రస్తుతానికైతే తన ద్రుష్టి అంత బాలీవుడ్ పైనే ఉందని ఇక్కడ మరికొన్ని చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్నాకే దక్షిణాది చిత్రాల గురించి ఆలోచిస్తానని ఆమె క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version