బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ప్రస్తుతం ‘హెలికాప్టర్ ఈలా’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. దాంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న కాజోల్, తాజాగా తనుశ్రీ దత్తా – నానా పటేకర్ వివాదం పై స్పందించింది. ఆడవారి పట్ల లైంగిక వేధింపులు నిజమేనని.. కాకపోతే ఇవి కేవలం చిత్ర పరిశ్రమకే మాత్రమే పరిమతం కాదని, అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు ఎక్కువగానే లైంగిక వేధింపులను ఎదురుకుంటున్నారని ఆమె తెలిపారు.
కాజోల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా సినీ కెరీర్ లో నేను ఎంతోమంది మగవారితో కలిసి పని చేశాను. కానీ నేను మాత్రం ఎప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు. కారణం నేను ఎప్పుడూ నా జాగ్రత్తల్లో నేను ఉంటాను. అలాగే ‘నా ముందు అలాంటివి జరిగితే మాత్రం నేను తగిన విధంగానే స్పందించే దాన్ని’. ఇక ఇటీవలే ఇతర దేశాల్లో వచ్చిన విధంగా మన దగ్గర కూడా ‘మీ టూ’ ఉద్యమం వస్తే బాగుంటుంది. ఆడవారు వారి సమస్యల పై పోరాటం చేయాలి. అప్పుడే వారి దాడులు ఆగుతాయి అని కాజోల్ తెలిపారు.
