హీరోగా రాబోతున్న ‘పవన్ కళ్యాణ్’ దర్శకుడు !

SJ Surya

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ చిత్రంలో విలన్ గా నటించి, తన నటనతో ఆకట్టుకున్నాడు ఎస్‌.జె. సూర్య. తాజాగా ఎస్‌.జె. సూర్య ప్రధాన పాత్రలో ఓ చిత్రం రాబోతుంది. ఇప్పుడు ఆ చిత్రానికి ‘మాన్‌ స్టర్‌’ అనే టైటిల్‌ ని ఫిక్స్ చేశారు. అయితే మాన్‌ స్టర్‌ కి మీనింగ్ రాక్షసుడు అని అర్ధం వస్తోంది. కథకు అనుగుణంగా ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా ‘ఒరు నాళ్‌ కూత్తు’ దర్శకుడు నెల్సన్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య సరసన ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందట. కాగా ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ చిత్రం చిన్న పిల్లల నేపథ్యంలో సాగుతుందని చిత్రబృందం చెబుతుంది. ఇక ఎస్‌.జె. సూర్య పవన్‌ కల్యాణ్‌ కి ‘ఖుషి’ రూపంలో సూపర్ డూపర్ హిట్ ని అందించిన దర్శకుడు కావడం విశేషం.

Exit mobile version