లాస్ట్ షెడ్యూల్ లో నిఖిల్ ‘ముద్ర’ !

nikhil14

కిరాక్ పార్టీ చిత్రం తరువాత యువ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. ప్రస్తుతం ఈచిత్రం యొక్క చివరి షెడ్యూల్ హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ తరువాత పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసి సినిమాను నవంబర్ 8న విడుదల చేయనున్నారు. తమిళ దర్శకుడు టి ఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ్ లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్ గా తెరెకెక్కుతుంది .

ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈచిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ యువ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలోనే ఈచిత్రం యొక్క టీజర్ విడుదల తేదీ ని ప్రకటించనున్నారు.

Exit mobile version