పి.వి సింధు బయోపిక్ లో పి.వి సింధు ?

pvsindh.jpgjpg

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల జీవితం ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కించడం ఇటీవల ట్రెండ్ గా మారింది. ఇప్పటికే ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’ జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చాయి. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పి.వి సింధు జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే సినీ నటుడు సోనూ సూద్‌ గతంలోనే ప్రకటించాడు.

కాగా తాజాగా.. ఈ చిత్రం స్క్రిప్ట్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన సోనుసూద్, సింధుతో పాటు ఆమె తల్లితండ్రులను కూడా కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సోనూ.. మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బయోపిక్ లో పి.వి సింధు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version